అతికష్టం మీద 106 పరుగులు చేసిన సఫారీలు... టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం
- తిరువనంతపురంలో మ్యాచ్
- బౌలింగ్ కు అనుకూలంగా పిచ్
- విజృంభించిన భారత బౌలర్లు
- అర్షదీప్ కు 3 వికెట్లు
- 41 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్
తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులు చేయగా, ఐడెన్ మార్ క్రమ్ 25, వేన్ పార్నెల్ 24 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీలు... 100 పరుగుల మార్కు అందుకున్నారంటే ఆ క్రెడిట్ కేశవ్ మహరాజ్ కే దక్కుతుంది. కేశవ్ మహరాజ్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సులతో విలువైన పరుగులు జోడించాడు. అతడికి పార్నెల్ నుంచి మంచి సహకారం లభించింది.
సఫారీ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.