రెండో రోజు ఈడీ విచార‌ణ‌కు మంచిరెడ్డి... 10 గంట‌ల పాటు కొన‌సాగిన విచార‌ణ‌

  • విదేశాల్లో పెట్టుబ‌డులు, ఫెమా ఉల్లంఘ‌న‌ల‌పై ప్ర‌శ్న‌లు
  • మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీల‌పైనా కూపీ లాగిన ఈడీ
  • అవ‌స‌ర‌మైతే గురువార‌మూ విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని మంచిరెడ్డికి సమాచారం  
విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టే క్ర‌మంలో ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు వ‌రుస‌గా రెండో రోజు బుధ‌వారం కూడా విచారించారు. తొలి రోజైన మంగ‌ళ‌వారం 9 గంట‌ల పాటు మంచిరెడ్డిని విచారించిన ఈడీ... రెండో రోజున ఏకంగా 10 గంట‌ల పాటు ఆయ‌న‌ను విచారించింది.

సుదీర్ఘంగా కొన‌సాగిన విచార‌ణ‌లో భాగంగా విదేశాల్లో పెట్టుబ‌డులు, ఫెమా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై ఈడీ అధికారులు మంచిరెడ్డిని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీల‌పైనా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ప‌లు బ్యాంకు లావాదేవీల‌పై మంచిరెడ్డి నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు. బుధ‌వారం విచార‌ణ ముగిసింద‌ని చెప్పిన ఈడీ అధికారులు.. అవ‌స‌ర‌మ‌నుకుంటే గురువారం కూడా విచారణ‌కు రావాల్సి ఉంటుంద‌ని మంచిరెడ్డికి తెలిపిన‌ట్లు స‌మాచారం.


More Telugu News