సౌదీ అరేబియా ప్రధానిగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ను నియమించిన రాజు

  • సౌదీ పాలనలో కీలక ఘట్టం
  • ఇప్పటిదాకా ప్రధానిగా వ్యవహరించిన రాజు
  • తన బాధ్యతలను పెద్ద కొడుక్కి అప్పగించిన వైనం
  • ఇతర కుమారులకు కీలక బాధ్యతలు
సౌదీ అరేబియా పాలనలో ఇప్పటిదాకా కీలక పాత్ర పోషిస్తున్న యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. తన పెద్ద కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ ను సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ (86) ప్రధానమంత్రిగా నియమించారు. రెండో కుమారుడు ఖాలిద్ బిన్ సల్మాన్ ను రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. మరో కుమారుడు అబ్దులజీజ్ బిన్ సల్మాన్ కు విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజశాసనం చేశారు. 

ఇప్పటివరకు రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ సౌదీ ప్రధానిగా వ్యవహరించారు. ఇకపై ఆయన బాధ్యతలన్నీ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ కు బదిలీ కానున్నాయి. 

మహ్మద్ బిన్ సల్మాన్ ను సంక్షిప్తంగా 'ఎంబీఎస్' అని పిలుస్తారు. ఆయన ఇప్పటిదాకా రక్షణ మంత్రిగా ఉంటూ, దేశ వ్యవహారాలన్నీ తానే చూసుకున్నారు. ఇకపై అధికారికంగా సౌదీ దేశాధినేతగా వ్యవహరించనున్నారు.


More Telugu News