దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ స్పష్టంగా కనిపిస్తోంది: ఎస్డీపీఐ
- పీఎఫ్ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
- బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారన్న ఎప్డీపీఐ
- దర్యాప్తు సంస్థలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శ
ఇస్లామిక్ అతివాద సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ దేశవ్యాప్త దాడుల అనంతరం నిషేధం విధించింది. ఈ సోదాల్లో అంత్యంత నేరపూరిత కీలకమైన పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు, పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను బ్యాన్ చేయడంపై సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) విమర్శలు గుప్పించింది. ప్రజాస్వామ్యానికి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది. ప్రజలకు రాజ్యంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శించింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రెయిడ్స్ చేయడం, అరెస్టులు చేయడం చేస్తున్నారని తెలిపింది. వాక్ స్వాతంత్య్రాన్ని, నిరసన వ్యక్తం చేసే హక్కును హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.