చిరంజీవిగారు ఒట్టేసి చెప్పమన్నారు .. అప్పటి నుంచీ అగ్గిపెట్టె ముట్టలేదు: శివాజీ రాజా
- బెంగుళూర్ ఫామ్ హౌస్ గురించిన ప్రస్తావన
- సిగరెట్ తాగనని అన్నయ్యకి ఒట్టేశానన్న శివాజీ
- ఇప్పటికీ అదే మాటకి కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్య
ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా చెప్పుకోదగినవారిలో శివాజీ రాజా - శ్రీకాంత్ కనిపిస్తారు. ఈ ఇద్దరూ కూడా చిరంజీవితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. అన్నయ్యా .. అన్నయ్యా అంటూ ఆయన పట్ల తమకి గల అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాంటి శివాజీ రాజా తాను అన్నయ్య కోసమే సిగరెట్లు మానేశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఆయన మాట్లాడుతూ .. "22 ఏళ్ల క్రితం మెగా ఫ్యామిలీలో చిరంజీవిగారు .. నాగబాబు గారు .. పవన్ కల్యాణ్ గారు .. నేను .. శ్రీకాంత్ .. రవితేజ .. సౌందర్య ఫ్యామిలీ కలిసి బెంగుళూరులోని చిరంజీవిగారి ఫామ్ హౌస్ లో ఓ చిన్న ఫంక్షన్ నిమిత్తం కలుసుకున్నాము. చిరంజీవి గారికి పెద్దగా సిగరెట్లు అలవాటు లేదు. రాత్రి 12 దాటిపోయింది. నేను .. శ్రీకాంత్ ఇద్దరం సిగరెట్లు తాగడం చిరంజీవిగారు చూశారు.
"ఏంట్రా ఈ సిగరెట్లు తాగడం .. ఇలా అయితే ఎక్కువ కాలం ఉండరు. ఇక ఎప్పుడూ కాల్చమని ఒట్టేయండి" అన్నారు. నేను .. శ్రీకాంత్ ఇద్దరం కూడా వెంటనే ఒట్టేశాము. ఇలా వేరేవారికి ఒట్లు వేయడం అటు శ్రీకాంత్ కీ .. ఇటు నాకు ఇద్దరికీ అలవాటే. ఆ మరుసటి రోజు నుంచే మళ్లీ తాగేవాళ్లం. కానీ అన్నయ్యకి ఒట్టువేసిన తరువాత నుంచి ఇంతవరకూ .. అంటే 22 ఏళ్లలో అగ్గిపెట్టె ముట్టుకోలేదు" అంటూ శివాజీరాజా చెప్పుకొచ్చారు.