'బిగ్‌బాస్ కోసం 1000 కోట్ల పారితోషికం' వార్తలపై సల్మాన్ ఏమన్నాడంటే..!
- అంత తీసుకుంటే జీవితంలో ఇక పని చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- అందులో పావు వంతు సంపాదన కూడా లేదన్న సల్మాన్ ఖాన్
- తన బిగ్ బాస్ షోలో కొనసాగాలని లేదన్న బాలీవుడ్ స్టార్ హీరో
హిందీ బిగ్ బాస్ 16వ సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యహరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీజన్ థీమ్ గురించి సల్మాన్ వివరించారు. అలాగే, ఈ షో కోసం తాను రూ. 1000 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై కూడా సల్మాన్ స్పందించారు.
"నా పారితోషికం గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. నేను ఎప్పుడైనా రూ. 1000 కోట్లు తీసుకుంటే, ఇక నా జీవితంలో పని చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అంత మొత్తం పారితోషికం తీసుకునే రోజు వస్తుందని కోరుకుంటున్నా. నాకు అంత వస్తే లాయర్ల ఫీజులు వంటి అనేక ఇతర అవసరాలకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నా లాయర్లు సల్మాన్ ఖాన్ కంటే తక్కువేం కాదు. వెయ్యి కోట్ల పారితోషికం వార్తల్లో నిజం లేదు. నా సంపాదన దానిలో పావు వంతు ఉండదు. ఈ వార్తలను ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వాళ్లు కూడా చదువుతున్నారు" అని సల్మాన్ వ్యాఖ్యానించారు.
బిగ్ బాస్ చేయాలని లేదు..
తనకు బిగ్ బాస్ షోను హోస్ట్ చేయాలని లేదని సల్మాన్ చెప్పారు. కానీ, తప్పడం లేదన్నారు. "ఈ షోలో నాకు చిరాకు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను షోను హోస్ట్ చేయనని ఛానెల్ వాళ్లకి చెప్పాను. కానీ వాళ్లకు మరో చాయిస్ లేదు కాబట్టి నా వద్దకు తిరిగి వచ్చారు. వాళ్లకు చాయిస్ ఉండి ఉంటే చాలా కాలం కిందటే నన్ను తీసేసే వాళ్లు. నా స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు ఉన్నప్పటికీ, ఛానెల్ వాళ్లు ఎప్పటికీ ఆ పని చేయరు" అని సల్మాన్ నవ్వుతూ చెప్పారు. ఇక, ఈ షోలో తాను తరచూ సహనం కోల్పోవడంపై స్పందించారు. పోటీదారులు అతి చేయడం వల్ల తాను కొన్నిసార్లు పరిమితిని దాటవలసి వస్తుందన్నారు.