వీటికి దూరంగా ఉంటే ఆఫీసులో నిద్ర బాధ నుంచి బయటపడొచ్చు!
- పొద్దంతా పనిచేసి శరీరం అలసిపోతుందంటున్న నిపుణులు
- మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి కోరుకుంటుందని వెల్లడి
- కొన్ని రకాల ఆహార పదార్థాలు, విశ్రాంతి సమయాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చని సూచన
పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన జీవితం.. ఇల్లు, పిల్లలు ఇలా ఎన్నో చక్కబెట్టుకుని ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే మధ్యాహ్నం సమయానికి అలసిపోతారు. దీనికితోడు మధ్యాహ్నం భోజనం చేయగానే రెండూ కలిసి శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. నిద్ర ముంచుకువస్తుంటుంది. పనిపై ఏకాగ్రత చూపలేక, అలాగని వెళ్లి విశ్రాంతి తీసుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒకరిద్దరి సమస్య కాదు.. చాలా మంది అనుభవించే ఇబ్బందే. అయితే పలు జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తగిన నిద్ర లేకపోవడం
సాధారణంగా మనకు కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే ఏవో పనులు, ఒత్తిళ్ల కారణంగా చాలా మంది సరిగా నిద్రపోవడం లేదు. లేదా ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను నిద్రకు అనుగుణంగా మార్చుకోవాలి. రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రపోవాలి.
సరైన సమయానికి, సరైన భోజనం తీసుకోవడం
ఎవరైనా రోజూ సరైన సమయానికి, సరైన భోజనం చేయడం వల్ల నిద్ర ఇబ్బంది తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత నిద్రకు కనీసం మూడు నాలుగు గంటల విరామం ఉండేలా చూసుకుని, ముందే భోజనం చేయాలని చెబుతున్నారు. ఇక మసాలాలు, బాగా హెవీగా ఉండే ఆహారం తీసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు.
గాడ్జెట్స్ కు దూరంగా..
పొద్దంతా బాగా బిజీగా ఉండే చాలా మంది రాత్రి కాస్త సమయం చిక్కగానే సెల్ ఫోన్ తో గడిపేస్తున్నారు. టీవీలో గంటలకు గంటలు కూర్చుని సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి చేయవద్దని.. ఎలక్ట్రానిక్ పరికరాల డిస్ ప్లే నుంచి వెలువడే నీలి రంగు కాంతి నిద్రకు దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వెలుగులో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. నిద్ర పోయేందుకు రెండు గంటల ముందు నుంచే ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపేయాలని చెబుతున్నారు.
మద్యం, కాఫీ వంటి వాటితో ఇబ్బంది పెద్దదే..

- ఆల్కహాల్ అలవాటు వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. ముందు రోజు తీసుకున్న ఆల్కహాల్ ప్రభావం తర్వాతి రోజంతా చూపిస్తుంది. ఏ పని మీదా ఏకాగ్రత పెట్టలేరు. శరీరం అలసిపోయినట్టయి నిద్ర వస్తుంది. అందువల్ల ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- సాధారణంగా కొందరికి సాయంత్రం తర్వాత కూడా కాఫీ, టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. వీటిలోని కెఫీన్ శరీరాన్ని చురుగ్గా చేసి నిద్రకు దూరం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- రాత్రిపూట పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని.. దీనివల్ల అటు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటంతోపాటు నిద్ర సమస్య కూడా తీరుతుందని నిపుణులు చెబుతున్నారు.