కేసీఆర్​ చూపు పడగానే ఇండియాగేట్​ వద్ద బతుకమ్మ వెలుగుతోంది: కల్వకుంట్ల కవిత

  • ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవన్న ఎమ్మెల్సీ
  • విభజన కావాలో, ఐక్యత కావాలో బీజేపీ తేల్చుకోవాలని డిమాండ్
  • టీఆర్ఎస్ ఏర్పాటయ్యాకే తెలంగాణ పండుగలకు గౌరవం దక్కిందని వ్యాఖ్య
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణ పండుగలు, పద్ధతులు, భాషకు గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ, బోనాల వంటి పండుగలను కేసీఆర్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గౌరవాన్ని పెంచిందని తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కేంద్రం వైపు చూస్తున్నారనగానే ఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద బతుకమ్మ వెలుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారు.

బతుకమ్మ వేడుకలతో..
బీజేపీ హైదరాబాద్‌ లో సర్దార్ పటేల్‌ పేరు చెప్పి విమోచనం అంటోందని, అదే పటేల్‌ విగ్రహంతో గుజరాత్‌లో యూనిటీ అని చెబుతోందని కవిత విమర్శించారు. దీనిపై బీజేపీకే స్పష్టత లేదని మండిపడ్డారు. అసలు విభజన కావాలో, ఐక్యత కావాలో బీజేపీ తేల్చుకోవాలన్నారు. రాష్ట్ర యువత కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర మహిళా ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొని బతుకమ్మ ఆడారు.



More Telugu News