ఏపీని 3 రాష్ట్రాలు చేస్తే మేలు... ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జగ్గారెడ్డి
- వరుసగా రెండో రోజు జగ్గారెడ్డి, షర్మిలల మధ్య మాటల యుద్ధం
- షర్మిల తన కుటుంబ పంచాయితీని ఏపీలోనే పెట్టుకోవాలన్న జగ్గారెడ్డి
- షర్మిల తన జోలికి రాకుంటే తాను ఆమె జోలికి వెళ్లనని వ్యాఖ్య
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి), వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా మాటల యుద్ధం జరిగింది. ప్రజా ప్రస్థానం పేరిట సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్న షర్మిల... స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డిపై సోమవారం విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలను ఖండిస్తూ జగ్గారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. జగ్గారెడ్డి స్పందనపై షర్మిల మరోమారు విమర్శలు గుప్పించారు. దీంతో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి... షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన జోలికి రాకుంటే... తాను ఆమె జోలికి వెళ్లనని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు.
సీఎం కుర్చీ కోసం జగన్ కుటుంబంలో గొడవ జరుగుతోందన్న జగ్గారెడ్డి... ఆ గొడవకు పరిష్కారం కావాలంటే ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు కంటే ముందు ఏపీని 3 రాష్ట్రాలుగా విభజించాలని అన్నారు. అప్పుడు జగన్‌తో పాటు సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్న షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా సీఎం అయిపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల తన కుటుంబ పంచాయితీని ఏపీలోనే పెట్టుకోవాలని ఆయన అన్నారు. అవసరమైతే మోదీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.