గూగుల్ ఇండియా పాలసీ హెడ్ అర్చనా గులాటీ రాజీనామా
- నీతి ఆయోగ్ లో జాయింట్ సెక్రటరీగా పని చేసిన అర్చన
- వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏడాది పాటు ఫ్రీ లాన్సర్ గా పని చేసిన వైనం
- ఇండియాలో యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటున్న గూగుల్
గూగుల్ ఇండియా గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ హెడ్ పదవికి అర్చనా గులాటీ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఆమె ఐదు నెలల క్రితం గూగుల్ లో చేరారు. నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ (డిజిటల్ కమ్యూనికేషన్స్) ఉద్యోగానికి రాజీనామా చేసి గూగుల్ లో పాలసీ హెడ్ గా బాధ్యతలను స్వీకరించారు.
ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అర్చన ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ చేశారు. అయితే గూగుల్ కు ఆమె ఎందుకు రాజీనామా చేశారనే కారణం మాత్రం తెలియరాలేదు. ఈ అంశంపై అర్చన కానీ, గూగుల్ ఇండియా కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియా, వారిని కాంటాక్ట్ చేసినప్పటికీ... స్పందించేందుకు తిరస్కరించారు.
ఇండియాలో యాంటీ ట్రస్టు కేసులతో పాటు టెక్ సెక్టార్ రెగ్యులేషన్స్ కు సంబంధించిన సమస్యలను గూగుల్ ఎదుర్కొంటున్న సమయంలో అర్చన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఆగస్ట్ నుంచి 2021 మార్చ్ వరకు అర్చన నీతి ఆయోగ్ లో పని చేశారు. ఈ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏడాది పాటు ఫ్రీలాన్సర్ గా పని చేశారు. అనంతరం గూగుల్ లో చేరారు.