అప్పట్లోనే చిరంజీవి గారు చకచకా ఎక్స్ ప్రెషన్స్ మార్చేసేవారు: సీనియర్ హీరోయిన్ గీత

  • గ్లామరస్ హీరోయిన్ గా 'గీత'కి మంచి పేరు
  • తెలుగులో తొలి చిత్రం 'మనవూరి పాండవులు'
  • కృష్ణంరాజును తలచుకుని కన్నీళ్లు పెట్టిన గీత 
  • చిరూ సినిమాలో చేయాలనుందంటూ రిక్వెస్ట్
80వ దశకంలో వెండితెరపై అందాల కథానాయిక అనిపించుకున్నవారిలో 'గీత' ఒకరు. 'మనవూరి పాండవులు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆమె, ఆ తరువాత వివిధ భాషల్లో కలుపుకుని 250 సినిమాలకు పైగా నటించారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"మా నాన్నగారిది నెల్లూరు .. ఆమ్మగారిది చెన్నై. తమిళంలో 'భైరవి' అనే సినిమాతో పరిచయమయ్యాను. రజనీ సార్ అప్పటికే స్టార్. నేను ఆ సినిమాలో టైటిల్ రోల్ పోషించడం విశేషం. తెలుగు తెరకి నన్ను హీరోయిన్ గా పరిచయం చేసింది కృష్ణంరాజుగారు. ఆయనను కలిసి చాలా కాలమైపోయింది. ఇప్పటికీ ఆయన లేరంటే చాలా బాధగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

'మనవూరి పాండవులు' సినిమా సమయానికి నాకు యాక్టింగ్  వచ్చేది కాదు. అప్పట్లోనే చిరంజీవి గారు చకచకా ఎక్స్ ప్రెషన్స్ మార్చేసేవారు. ఇక ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ హీరో ఆయనే. ఆయనతో కలిసి నటించాలని ఉంది. ఆయన సినిమా నుంచి ఒక మంచి కేరక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News