జపాన్ మాజీ ప్రధాని అంత్యక్రియలు ప్రారంభం.. పలువురు ప్రపంచ నేతల హాజరు

  • టోక్యో హాల్ లో కొనసాగుతున్న అంత్యక్రియలు
  • అస్థికలను తీసుకొచ్చిన అబే భార్య అకీ
  • జపాన్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కేవలం రాచకుటుంబానికే పరిమితం
  • మరోపక్క అంత్యక్రియల నిర్వహణపై తీవ్ర విమర్శలు 
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. టోక్యోలో జరుగుతున్న ఈ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. టోక్యో హాల్ లో జరుగుతున్న అంత్యక్రియల కార్యక్రమానికి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. షింజో అబే భార్య అకీ ఆయన అస్థికలను టోక్యో హాల్ కు తీసుకొచ్చారు. అంత్యక్రియల సందర్భంగా అబే గౌరవార్థం 19 ఫిరంగులతో కాల్పులు జరిపారు. 

మరోవైపు ఈ అంత్యక్రియలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అంత్యక్రియలకు భారీగా ఖర్చు అవుతుందని విమర్శకులు అంటున్నారు. జపాన్ లో కేవలం రాచకుటుంబానికే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, మాజీ ప్రధానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జపాన్ చరిత్రలో ప్రభుత్వ లాంఛనాలతో ఒక రాజకీయవేత్త అంత్యక్రియలు జరగడం ఇది రెండోసారి మాత్రమే.


More Telugu News