భారత్ జోడో యాత్రలో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన కాంగ్రెస్ వివరణ ఇదిగో!
- భారత్ జోడో యాత్రలో విలాసాల విడిది అంటూ వైరి వర్గాల ఆరోపణ
- నేల మీదే పార్టీ శ్రేణులు విశ్రాంతి తీసుకుంటున్న వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
- వైరి వర్గాలు ఆరోపిస్తున్న విలాసాలు ఇవేనంటూ దెప్పిపొడుపు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాలుపంచుకుంటున్న నేతలకు ఆ పార్టీ విలాసాలతో కూడిన విడిది ఏర్పాటు చేసిందని వైరివర్గాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... వాటిపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఓ వీడియో సాక్ష్యంతో వివరణ ఇచ్చింది. సోమవారం 14 కిలో మీటర్ల మేర సాగిన యాత్ర అనంతరం యాత్రలో పాలుపంచుకున్న నేతలు, కార్యకర్తలు ఓ పెద్ద గోడౌన్‌లా కనిపిస్తున్న భవనంలో నేల మీదే పరుపులు వేసుకుని పడుకున్నారు.
ఈ విడిదిలో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవరికి వారుగా తమకు ఇచ్చిన పరుపులు పరచుకుని పడుకున్నారు. భారత్ జోడో యాత్రలో 5 స్టార్ విలాసాలు అంటూ వైరి వర్గాలు ఆరోపిస్తున్న విలాసాలతో కూడిన విడిది ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మనీష్ కందూరి తెలిపారు.