హైదరాబాదులో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
- నగరంలోనూ, శివారుప్రాంతాల్లోనూ వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రోడ్లపై భారీగా నిలిచిన నీరు
- వాహనదారుల ఇబ్బందులు
ఈ సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, దోమలగూడ, లోయర్ ట్యాంక్ బండ్, భోలక్ పూర్, ముషీరాబాద్, భాగ్ లింగంపల్లి, జవహర్ నగర్, కవాడిగూడ, గాంధీనగర్, శంషాబాద్, నార్సింగి, అత్తాపూర్, రాజేంద్రనగర్, గండిపేట, బండ్లగూడ జాగీర్, ఆరాంఘర్, మణికొండ, కిస్మత్ పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.