50వ వసంతంలోకి ఏపీఐఐసీ.. గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్

  • 1973లో ప్రారంభ‌మైన ఏపీఐఐసీ
  • రూ.20 కోట్ల మూల‌ధ‌నంతో ప్ర‌స్థానం ప్రారంభం  
  • రాష్ట్ర ప్ర‌గ‌తిలో ఏపీఐఐసీ కీల‌క భూమిక పోషించాల‌ని జ‌గ‌న్ ఆకాంక్ష‌
తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మయంలో రాష్ట్ర పారిశ్రామికోత్ప‌త్తికి దోహ‌ద‌ప‌డేలా ఏర్పాటు చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) సోమ‌వారం 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. 1973 సెప్టెంబ‌ర్ 26న రూ.20 కోట్ల మూల‌ధ‌నంతో ఈ సంస్థ ఏర్పాటు కాగా... రాష్ట్రంలో కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ఆయా సంస్థ‌ల యూనిట్ల‌కు అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో రాణించిన ఈ సంస్థ‌... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తోంది.

ఏపీఐఐసీ 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంస్థ‌కు చెందిన గోల్డెన్ జూబ్లీ లోగోను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్, ఏపీఐఐసీ అధికారులు హాజ‌ర‌య్యారు. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఏపీఐఐసీ నిరంతరం కృషిచేయాలని, రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని జ‌గ‌న్ ఆకాంక్షించారు.


More Telugu News