వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్
- మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
- బాల్య వివాహాలపై చర్చ
- బాల్య వివాహాలు పూర్తిగా నివారించాలని ఆదేశాలు
ఏపీ సీఎం జగన్ ఇవాళ మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణలో కల్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు.
అందులో భాగంగానే, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లిచేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలన్న నిబంధన తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాధ తదితరులు కూడా పాల్గొన్నారు.