గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
- రైటర్ గా కోన వెంకట్ ఫుల్ బిజీ
- ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వవలసిందేనంటూ వ్యాఖ్య
- గోపీ మోహన్ తో గొడవ లేదంటూ వివరణ
- తన స్పీడ్ కారణంగానే ఇన్ని సినిమాలు చేశానంటూ వెల్లడి
రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు ఉంది. శ్రీను వైట్లతో కలిసి ఆయన పనిచేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లే. ఇక వీరి సక్సెస్ లో మరో రైటర్ గోపీ మోహన్ హస్తం కూడా ఉండేది. అయితే కొన్ని కారణాల వలన శ్రీను వైట్ల - కోన వెంకట్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి పనిచేయడం లేదు. అలాగే గోపీ మోహన్ - కోన కూడా కలిసి రాయడం లేదు.
ఒక యూ ట్యూబ్ ఛానల్లో ఇందుకు గల కారణం గురించి చెప్పమనే ప్రశ్న కోన వెంకట్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చిందే గుర్తింపు కోసం .. నా క్రెడిట్ ను మరొకరు తీసుకుంటానంటే ఊరుకోను. అవతల వ్యక్తి ఉద్దేశం ఏదైనా నాకు రావలసిన క్రెడిట్ రాకపోతే బాధపడతాను .. అలాంటి చోట పని చేయడం మానేస్తాను. టీమ్ వర్క్ వల్లనే సక్సెస్ సాధ్యపడుతుందని నేను నమ్ముతాను. అందరినీ గుర్తించవలసిందే.
ఇక గోపీమోహాన్ విషయానికి వస్తే .. తాను చాలా నిదానం. అలా తాపీగా రాయడం ఆయనకి అలవాటు .. నేనేమో కొంచెం స్పీడ్ ఎక్కువ.. అందువలన మా ఇద్దరికీ సెట్ కాలేదు. అంతే తప్ప ఎలాంటి మనస్పర్థలు లేవు. శ్రీను వైట్లకి గోపీ మోహన్ దగ్గర కావడం వలన ఆయనను నేను దూరం పెట్టాను అనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు" అని చెప్పుకొచ్చారు.