మల్కాపూర్ చెరువు అందాలను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల
- సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం యాత్ర
- మల్కాపూర్ చెరువు అందాలను చూసి ముగ్ధురాలైన షర్మిల
- తన తండ్రి వైఎస్సార్ ప్రణాళికతోనే చెరువుకు కొత్త రూపు వచ్చిందని వెల్లడి
- చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల కొనసాగిస్తున్న పాదయాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం సంగారెడ్డికి రెండో వైపున ఉన్న మల్కాపూర్ చెరువును ఆమె పరిశీలించారు. రాష్ట్ర విభజనకు ముందే మల్కాపూర్ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందగా... ఆ తర్వాత కొంతమేర చెరువు చుట్టూ అభివృద్ధి పనులు జరిగాయి.
కొత్తగా చేరిన అభివృద్ధితో సంగారెడ్డి ప్రజలను మల్కాపూర్ చెరువు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతంలో మల్కాపూర్ చెరువు ఓ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. మల్కాపూర్ చెరువు వద్ద నిలిచిన షర్మిల చెరువు అందాలను చూస్తూ మైమరచిపోయారు. తన తండ్రి రూపొందించిన ప్రణాళిక కారణంగానే ఈ చెరువు సరికొత్త అందాలను సంతరించుకున్నదని తెలిపారు. మల్కాపూర్ చెరువును పర్యాటక ప్రదేశంలో తీర్చిదిద్డడంతో పాటుగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని ఆమె ఆరోపించారు.