లక్ష్యఛేదనలో 100 పరుగులు దాటిన టీమిండియా స్కోరు
- 13 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసిన భారత్
- అర్ధసెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్
- ఇంకా 42 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన భారత్
ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ లో లక్ష్యఛేదనలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 13 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 58, కోహ్లీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్యకుమార్ 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. కోహ్లీ 29 బంతులాడి 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో గెలవాలంటే టీమిండియా 42 బంతుల్లో 65 పరుగులు చేయాలి. అంతకుముందు, టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ 1, రోహిత్ శర్మ 17 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో సామ్స్ 1, కమిన్స్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో గెలవాలంటే టీమిండియా 42 బంతుల్లో 65 పరుగులు చేయాలి. అంతకుముందు, టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ 1, రోహిత్ శర్మ 17 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో సామ్స్ 1, కమిన్స్ 1 వికెట్ తీశారు.