యాత్రలను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు: బొత్స సత్యనారాయణ
- అమరావతి రైతుల పాదయాత్రపై బొత్స సంచలన వ్యాఖ్యలు
- మూడు రాజధానులు తమ విధానమని జగన్ చెప్పారన్న బొత్స
- ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేముందని అన్నారు. యాత్రలను అడ్డుకోవడం తమకు ఐదు నిమిషాల పని అని చెప్పారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్రలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. అయితే, యాత్రలను అడ్డుకోవడం పద్ధతి కాదని చెప్పారు. మూడు రాజధానులు తమ విధానమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు. ఒక ప్రాంతం గురించో, కొందరు వ్యక్తుల గురించో ఆలోచించకూడదని చెప్పారు. మూడు రాజధానులకు అనుగుణంగా అన్ని సంఘాలు ర్యాలీలు చేయాలని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొట్టాలని కొందరు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయవద్దని అన్నారు. గతంలో ఉత్తరాంధ్రలో అంబలి తాగి బతికేవారని... ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత అన్నం తినడం ప్రారంభమయిందని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.