సాయంత్రం ఇండియా - ఆస్ట్రేలియా మధ్య టీ20... ఉప్పల్ స్డేడియం వద్ద ఆకట్టుకుంటున్న బతుకమ్మలు

  • ఆస్ట్రేలియా - ఇండియాల మధ్య చివరి టీ20
  • 55 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోనున్న స్టేడియం
  • భద్రతా విధుల్లో 2,500 మంది పోలీసులు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కు సమయం ఆసన్నమయింది. ఇప్పటి వరకు ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో... నగరవాసులు మ్యాచ్ కు పోటెత్తబోతున్నారు. 55 వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియం పూర్తిగా నిండిపోనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతించనున్నారు. 5 గంటలకు ఆటగాళ్లు స్టేడియంకు చేరుకుంటారు. 

మరోవైపు బతుకమ్మ పండుగ నేపథ్యంలో... స్టేడియం వద్ద భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, మ్యాచ్ ను వీక్షించడానికి సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం తరలిరానున్నారు. స్టేడియం వద్ద ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


More Telugu News