‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో వెంకటేశ్ తో రానా వైరమే హైలైట్
- రానా నాయుడు వెబ్ సిరీస్ టీజర్ విడుదల
- తండ్రి కొడుకులుగా నటించిన రానా, వెంకటేశ్
- నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్న సిరీస్
దగ్గుబాటి వెంకటేశ్, రానా ఇద్దరూ ప్రయోగాలకు వెనుకాడరు. మల్టీ స్టారర్స్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ బాబాయ్, అబ్బాయి కలిసి ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి ‘రానా నాయుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. బాబాయ్ వెంకీతో కలిసి రానా తొలిసారి ఇందులో నటిస్తున్నాడు. అది కూడా ఆయన కొడుకు పాత్రలో కావడంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోయే ఈ సిరీస్ లో వెబ్ సిరీస్ కోసం తెలుగు అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ నెట్ ఫ్లిక్స్ నిన్న ‘రానా నాయుడు’ టీజర్ విడుదల చేసింది. తండ్రి, కొడుకుల మధ్య వైరం ఇతివృత్తంలో ఈ వెబ్ సిరీస్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
‘మీకేమైనా హెల్ప్ కావాలా’ అంటూ రానా చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. దీనికి ‘నీ హెల్ప్ గురించి చాలా విన్నాను. ఎప్పుడు ఏ సెలెబ్రిటీ ఇబ్బందుల్లో పడినా వచ్చి పరిష్కరిస్తావట కదా. స్టార్స్‌కి ఫిక్సర్‌వి అన్నమాట’ అంటూ వెంకటేశ్ జవాబు ఇవ్వడంతో రానా పాత్ర రివీల్ అవుతుంది. డబ్బున్నవాళ్ల ఆర్థిక సమస్యలకి పరిష్కారం చెప్పే రానా నాయుడు పాత్రలో రానా కనిపించాడు. అతని తండ్రి నాగగా నటించిన వెంకీ జైలు నుంచి విడుదలవడంతో సమస్యలు మొదలవుతాయి. అసలు నాగ జైలుకెందుకు వెళ్లాడు, ఈ ఇద్దరి మధ్య గొడవలు ఏమిటనేది మిగతా కథ. ఇద్దరూ ఘర్షణ పడే సీన్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. తండ్రి కొడుకుల మధ్య వైరమే సిరీస్ కు హైలైట్ గా నిలవనుంది. ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ తేదీని నెట్ ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు.