బాలకృష్ణపై ఏపీ మంత్రుల విమర్శల దాడి

  • హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ
  • స్పందించిన మేరుగు నాగార్జున, విడదల రజని
విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. 

మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ... బాలకృష్ణా, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా టీడీపీ హయాంలో కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. "ఎన్టీఆర్ ను మీరంతా కలిసి చంపేశాకే కదా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది... చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా?" అంటూ ట్వీట్ చేశారు.

ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజని కూడా బాలకృష్ణపై ధ్వజమెత్తారు. "బాలకృష్ణా... ప్రభుత్వాసుపత్రులను పిల్లలను ఎలుకలు కొరికే ఆసుపత్రులుగా, సెల్ ఫోన్ల లైట్లలో ఆపరేషన్లు చేసే ఆసుపత్రులగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్.... ఇంకా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది... ఇది కరెక్టేనా?" అంటూ ప్రశ్నించారు. 

"ప్రజల ఆరోగ్యం అంటే మీకెందుకంత చులకన? 104, 108 వాహనాలను పాడుపెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమం చేస్తారా?" అంటూ రజని ట్వీట్ చేశారు.


More Telugu News