గుడివాడలో ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్ర.... కట్టుదిట్టమైన భద్రత

  • కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర
  • అమరావతి టు అరసవల్లి
  • గుడివాడలో భారీగా పోలీసుల మోహరింపు
  • ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు
  • ఏలూరులో చింతమనేని హౌస్ అరెస్ట్
అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ప్రవేశించింది. గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. 

రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ ల నడుమ ముందుకు తీసుకెళుతున్నారు. 

ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు బైక్ పై గుడివాడ చేరుకున్నారు. 

కాగా, గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చింతమనేని గుడివాడ వెళతారన్న అంచనాల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చింతమనేనికి నోటీసులు అందజేశారు. అయితే ఆయన నోటీసులు తిరస్కరించినట్టు తెలుస్తోంది.


More Telugu News