గుడివాడ చేరుకోనున్న అమరావతి రైతుల పాదయాత్ర... పోలీసు ఆంక్షలు ఉన్నాయన్న ఎస్పీ
- కాసేపట్లో గుడివాడకు రైతుల మహాపాదయాత్ర
- భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
- పట్టణంలోని కీలక ప్రాంతంలో పోలీసు కవాతు
- యాత్రలో 600 మందికే అనుమతి ఉందన్న ఎస్పీ జాషువా
అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేస్తున్న పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడలోని కీలక ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. గుడివాడలో పోలీసు ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.
బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.