మైక్రో ప్రాసెసర్ తో నడిచే మోకాలును అభివృద్ధి చేసిన ఇస్రో
- దివ్యాంగులకు ఉపకరించే కృత్రిమ మోకాలు
- వివిధ సంస్థల సహకారంతో ఇస్రో రూపకల్పన
- తేలిగ్గా ఉండే కృత్రిమ అవయవం
- ధర కూడా తక్కువే!
- త్వరలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వైద్య రంగంలో ఎంతో ఉపయుక్తకరమైన ఆవిష్కరణతో అందరినీ అచ్చెరువొందించింది. ఇస్రో సరికొత్త కృత్రిమ అవయవాన్ని అభివృద్ధి చేసింది. మైక్రో ప్రాసెసర్ తో నడిచే ఓ కృత్రిమ మోకాలిని తయారుచేసింది. దీన్ని మైక్రో ప్రాసెసర్ నియంత్రిత మోకాలు (ఎంపీకే) అని పిలుస్తారు.
ఇది అత్యంత తేలికగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.6 కేజీలు. ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, మార్కెట్లో లభించే కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ ఎలక్ట్రానిక్ మోకాలు ధర చాలా చౌక అని అంటున్నారు.
భారత్ లో ప్రస్తుతం లభించే కృత్రిమ మోకాలు ధర రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఇవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అయితే ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఎంపీకే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి అయితే, ఇవి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపే లభించవచ్చని తెలుస్తోంది.
ఈ ఎంపీకే సాయంతో ఎంతో సులువుగా నడవొచ్చని, దివ్యాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. కాగా, ఈ ఎంపీకే తయారీలో ఇస్రోకి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటార్ డిజెబిలిటీస్ (ఎన్ఐఎల్డీ), దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్, ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు సహకారం అందించాయి.
ఈ కృత్రిమ మోకాలులో మైక్రో ప్రాసెసర్, హైడ్రాలిక్ డాంపర్, లోడ్ అండ్ నీ యాంగిల్ సెన్సర్లు, కాంపోజిట్ నీ కేస్, లిథియం అయాన్ బ్యాటరీ తదితర పరికరాలు ఉంటాయి.