ఇది తెలుగు సినిమా .. షూటింగు జరిగిందంతా ఇక్కడే: సుహాసిని
- 'పీఎస్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సుహాసిని
- పెళ్లికి ముందే ఈ కథను విన్నానంటూ వివరణ
- మణిరత్నంతో రెహ్మాన్ కి ఉన్నది దైవీకమైన సంబంధమని వ్యాఖ్య
- ప్రతి ఒక్క రూ అద్భుతంగా చేశారంటూ కితాబు
మణిరత్నం తమిళంలో చేసిన 'పొన్నియిన్ సెల్వన్' .. తెలుగులో 'పీఎస్ 1' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో సుహాసిని మాట్లాడుతూ .. "నేను ఇండీస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అయింది. ఇంతకాలంగా నాపై చూపిస్తూ వచ్చిన ప్రేమ .. ఈ సినిమాపై చూపించండి .. అదే నా కోరిక.
పెళ్లికి ముందే మణిగారు ఈ కథకి సంబంధించిన 5 బుక్స్ ఇచ్చి, వన్ లైన్ ఆర్డర్ రాసి ఇవ్వమని చెప్పారు. ఆ పని సరిగ్గా చేయకపోతే పెళ్లి కేన్సిల్ అవుతుందేమోనని అనుకున్నాను .. కానీ అలా జరగలేదు. ఇది తమిళ కథనే అయినా, షూటింగు జరిగిందంతా ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాల్లోనే. అందువలన ఇది తెలుగువారి సినిమా. ఇక్కడ ఈ సినిమా దిల్ రాజుగారి బేబీ .. ఆయనే చూసుకోవాలి.
ఇక విక్రమ్ .. కార్తి .. జయం రవి అందరూ కూడా నాకు చాలా కాలంగా తెలుసు. ఇక రెహ్మాన్ మా ఫ్యామిలీకి సంబంధించినవారుగానే చెప్పుకోవాలి. మణిరత్నంగారితో ఆయనకి ఉన్న అనుబంధం సంగీతపరమైనది మాత్రమే కాదు .. దైవీకమైనదని నా ఉద్దేశం. ఈ సినిమాతో ఐశ్వర్యారాయ్ ని మరోసారి ప్రపంచమంతా పొగడబోతోంది" అంటూ చెప్పుకొచ్చారు.