కంగారూలపై భలే గెలిచారు... రెండో టీ20లో టీమిండియా విన్నర్... సిరీస్ విజేత ఎవరో తేలేది హైదరాబాదులో!
- నాగపూర్ లో మ్యాచ్
- మైదానం చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ ఆలస్యం
- 8 ఓవర్లకు కుదించిన అంపైర్లు
- మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
- 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు
- 7.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ మెరుపులతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేయగా, దినేశ్ కార్తీక్ 2 బంతుల్లో 10 పరుగులు చేశాడు. టీమిండియా ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాదులో జరగనుంది.
కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. గతరాత్రి కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా ఉండడంతో ఓవర్లను 20 నుంచి 8కి తగ్గించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ 43 (నాటౌట్), ఫించ్ 31 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్యఛేదనను టీమిండియా ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు.