నిజంగా ఇది నేను గర్వపడే సినిమా: ఐశ్వర్యరాయ్
- మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్'
- చోళరాజుల కాలంలో నడిచే కథ
- హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిన ఐశ్వర్యరాయ్
- ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్
మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, చోళరాజుల పాలనాకాలంలో నడుస్తుంది. అలాంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన ఐశ్వర్యరాయ్ రెడ్ కలర్ డ్రెస్ లో మెరిశారు. ఆమె మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా కూడా నాకు ఎంతో ఆత్మీయ స్వాగతం పలికారు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన టెక్నీషియన్స్ తో .. టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
ఇలాంటి ఒక సినిమా చేయాలనేది మణిరత్నంగారి డ్రీమ్. తెరపై ఈ సినిమా చూస్తుంటే ఒక అందమైన పెయింటింగ్ లా అనిపిస్తుంది. మేమంతా పడిన కష్టం ఫలించేది ఎప్పుడంటే, మీరంతా వెళ్లి ఈ సినిమాను చూసి ఆనందించినప్పుడు. ఈ సినిమాతో మణిరత్నం ఫ్యామిలీతో నాకు మరింత అనుబంధం ఏర్పడింది. గతంలో నా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఏ.ఆర్.రెహ్మాన్ గారు, ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.