చదవురాని వాళ్లు పాలిస్తే ఇలాగే ఉంటుందన్న నడ్డా... కేంద్రంలో ఉన్నవారి విద్యార్హతలు తాము అడగబోమంటూ డీఎంకే కౌంటర్
- తమిళనాడులో జేపీ నడ్డా పర్యటన
- డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు
- సీఎం స్టాలిన్ పై పరోక్ష వ్యాఖ్యలు
- తమిళనాడు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారన్న డీఎంకే
తమిళనాడులో పర్యటించిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేయగా, డీఎంకే అందుకు దీటుగా బదులిచ్చింది.
తమిళనాడు సర్కారు అనుసరిస్తున్న విద్యావిధానం, నీట్ ను వ్యతిరేకిస్తుండడంపై నడ్డా స్పందిస్తూ, చదువు రాని వాళ్లు పాలిస్తే ఇలాగే ఉంటుందని స్టాలిన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అందుకు డీఎంకే అదేస్థాయిలో బదులిచ్చింది.
కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న వారి విద్యార్హతలు తాము అడగబోమని, ఆ స్థాయికి తాము దిగజారబోమని కౌంటర్ ఇచ్చింది. బీజేపీలోని వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తూ, అసలు జై షా ఎవరు? ఎన్ని సెంచరీలు కొట్టారు? అని ప్రశ్నించింది.
కేంద్ర హోంమంత్రి కుమారుడైన జై షా భారత్ లో సుసంపన్నమైన క్రీడాబోర్డు బీసీసీఐకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు అని డీఎంకే వివరించింది. విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్ అని అభివర్ణించింది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని, తమిళనాడు ప్రజలు వివేకవంతులని డీఎంకే పేర్కొంది.