ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా ఎం.శ్రీనివాస్ నియామకం
- హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్
- నేటితో పదవీ విరమణ చేయనున్న గులేరియా
- గులేరియా స్థానంలో శ్రీనివాస్ ను నియమించిన కేంద్రం
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్యాలయం ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నూతన డైరెక్టర్ గా ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టులో కొనసాగుతున్న రణదీప్ గులేరియా నేటితో పదవీ విరమణ చేయనున్నారు. గులేరియా పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానంలో ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.