మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే... కుప్పకూలిన సెన్సెక్స్
- 1,020 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 302 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 8 శాతం వరకు నష్టపోయిన పవర్ గ్రిడ్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడే నమోదయింది. ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. తద్వారా వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు కోల్పోయి 58,098కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327క దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.53%), టాటా స్టీల్ (0.58%), ఐటీసీ (0.33%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-7.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.00%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.80%), బజాజ్ ఫైనాన్స్ (-2.73%).