ఇండియాతో కలిసి డ్రోన్లను అభివృద్ధి చేయనున్న అమెరికా

  • ఇండియాతో రక్షణ రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకుంటున్న అమెరికా
  • ఇండియాకు అన్ని విధాలా సహకరిస్తామన్న పెంటగాన్ సీనియర్ అధికారి
  • ఇండియా తయారు చేసే రక్షణ ఉత్పత్తులను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుందని వ్యాఖ్య
చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికాలు రక్షణ రంగంలో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలు కలిసి డ్రోన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డ్రోన్ ఎయిర్ క్రాఫ్టను ఇండియా తయారు చేస్తుందని... వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పారు. ఆయుధ సంపత్తిలో ఇండియా తన పరిధిని విస్తరించుకోవాలనుకుంటోందని... తన సొంత రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాకు అమెరికా అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. రక్షణ ఉత్పత్తులను ఇండియాతో కలిసి అభివృద్ధి చేసి, తయారు చేస్తామని తెలిపారు. 

రక్షణ ఉత్పత్తులను దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలోని తమ మిత్ర దేశాలకు సరసమైన ధరకు ఇండియా ఎగుమతి చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో ఇండియాతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపారు. మరోవైపు ఏసియా-పసిఫిక్ రీజన్లో పలు దేశాలతో చైనాకు విరోధం ఉంది. ఈ దేశాలకు ఇండియా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. ఇప్పటికే కొన్ని దేశాలకు ఇండియా నుంచి ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి.


More Telugu News