గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

  • గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
  • డిశ్చార్జి పిటిషన్లను ఈ నెల 29లోగా పరిష్కరించాలని సీబీఐ కోర్టుకు ఆదేశం
  • ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దంటూ ఆదేశాలు
  • విచారణ జాప్యానికి డిశ్చార్జి పిటిషన్లు వేశారన్న సుప్రీంకోర్టు
గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు విచారణను వీలయినంతగా జాప్యం చేశారని కోర్టు అభిప్రాయపడింది.

అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 29లోగా విచారణను ముగించాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. కేసు విచారణను జాప్యం చేయడానికే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారని కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


More Telugu News