42 రోజుల బ్యాటరీ స్టాండ్‌ బై.. తక్కువ ధరలో టెక్నో పాప్‌ 6 ప్రో ఫోన్‌.. ప్రత్యేకతలు ఇవిగో

  • 6.6 అంగుళాల పెద్ద పరిమాణంలో హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ డిస్ ప్లే
  • 3 జీబీ ర్యామ్ తో రూ.8 వేలలోపు ధరలోనే విడుదలయ్యే అవకాశం
  • సెప్టెంబర్ 26 నుంచి 30 మధ్య విడుదల కావొచ్చని టెక్ వెబ్ సైట్ల వెల్లడి
తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు అందించే టెక్నో సంస్థ ‘టెక్నో పాప్ 6 ప్రో’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తెస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఏకంగా 42 రోజుల పాటు స్టాండ్ బై టైమ్ ను తమ ఫోన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఈ మోడల్ ను విడుదల చేశారు. ఈ నెలాఖరులోగా భారత్ లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతల వివరాలను పలు టెక్ వెబ్ సైట్లు వెల్లడించాయి.

‘టెక్నో పాప్ 6 ప్రో’ ఫోన్ ప్రత్యేకతలివీ..
  • 6.6 అంగుళాల పెద్ద తెరతో, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ (720 X 1,616 పిక్సెల్స్) తో డిస్ ప్లే, వాటర్ డ్రాప్ ఆకారంలోని నాచ్ తో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్ లో లోడ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది.
  • పీస్ ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో ఈ ఫోన్లను విక్రయించనున్నారు.
  • ఆక్టాకోర్ ప్రాసెసర్ తో, 3 జీబీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ పరిమాణం 16.4.85 మిల్లీమీటర్ల పొడవు, 76.25 మిల్లీమీటర్ల వెడల్పు, 8.75 మిల్లీమీటర్ల మందంతో ఉంది.
  • వెనుక వైపు 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ ఆధారిత సెకండరీ కెమెరా ఉంటుంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండు వైపులా కెమెరాలకు ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం ఉంది.
  • 4జీ ఎల్ టీఈ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి సాధారణ సదుపాయాలతోపాటు ఎఫ్ఎం, ఓటీజీ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
  • ఇటీవలే టెక్నో సంస్థ ఈ మోడల్ ను బంగ్లాదేశ్ లో విడుదల చేసింది. అక్కడ 10,490 టాకాలకు విక్రయిస్తున్నారు. అదే మన కరెన్సీలో సుమారు రూ.8,200. అయితే బంగ్లాదేశ్ లో కంటే మన దేశంలో మరింత తక్కువకు ఫోన్లను విక్రయించనున్నట్టు టెక్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రూ.8 వేల లోపు ధరకే ఈ ఫోన్ లభిస్తుందని పేర్కొంటున్నాయి.


More Telugu News