నాపై పోటీ చేయాలనుకునేవారు మంచి పనులు చేయండి: కేటీఆర్​

  • తాను ఎన్నికల్లో ఎప్పుడూ డబ్బు, మద్యం పంచలేదన్న మంత్రి
  • తన పుట్టిన రోజున ఆర్భాటాలకు పోకుండా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించానని వెల్లడి
  • మంచి పనులు చేద్దాం, ప్రజల మనసులను గెలుచుకుందామని రాజకీయ నేతలకు పిలుపు
సిరిసిల్ల నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలనుకునే వారు మంచి పనులు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచలేదని చెప్పారు. మంచి పనులు చేద్దామని, ప్రజల మనసులను గెలుచుకుందామని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6 వేల మందికి పైగా విద్యార్థులకు బైజూస్ సాఫ్ట్ వేర్ లోడ్ చేసిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

అధికారం శాశ్వతమని కొందరు అనుకుంటారు
అధికారం రాగానే అది శాశ్వతమని కొందరు ఊహించుకుంటారని.. కాని వచ్చిన అవకాశాన్ని ఓ మంచి పనిని చేయడానికి ఉపయోగించాలని మంత్రి కేటీఆర్ రాజకీయ నాయకులకు సూచించారు. తాను అలాంటి మంచి పనులపై దృష్టి పెట్టానని చెప్పారు. తన పుట్టిన రోజున అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు పోకుండా.. నలుగురికి ఉపయోగపడే విధంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ప్రారంభించానని వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ విధంగా మంచి పనులు చేయాలని సూచించారు.


More Telugu News