విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోపై రూమర్!

  • 'ఖుషి' సినిమాతో బిజీగా విజయ్ దేవరకొండ
  • 'పుష్ప 2' సినిమా పనుల్లో సుకుమార్ 
  • ఇద్దరి కాంబోలో అనుకున్న ప్రాజెక్టు లేనట్టే 
  • 'లైగర్' ఫలితమే కారణమంటూ టాక్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఉండవలసి ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమేననే టాక్ బలంగానే వినిపిస్తోంది. సుకుమార్ ఆ ఆలోచనను పక్కన పెట్టాడని అంటున్నారు.

'లైగర్' ప్రమోషన్స్ లో భాగంగా పూరిని సుకుమార్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. 'పుష్ప 2' తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఆ సమయంలో కూడా సుకుమార్ చెప్పాడు. విజయ్ దేవరకొండ మంచి నటుడనీ, ఆయనతో సినిమా కొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని అప్పుడు పూరి కూడా అన్నాడు. 

కానీ 'లైగర్' ఫ్లాప్ కావడంతో లెక్కలు మారిపోయాయి. 'లైగర్' హిట్ అయితే విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేది. కానీ ఆ సినిమా పోవడంతో సుకుమార్ వెనక్కి తగ్గినట్టుగా చెబుతున్నారు. 'పుష్ప'తో తనకి వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.  


More Telugu News