ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా... చివరి రోజు 9 బిల్లులకు ఆమోదం
- 5 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు
- సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ తమ్మినేని
- మూజువాణి ఓటుతోనే 9 బిల్లులకు ఆమోదం లభించిన వైనం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. బుధవారం నాటి సమావేశాలు ముగియగానే... శాసన సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ దఫా సమావేశాల్లో మొత్తంగా 5 రోజుల పాటు సభ జరగగా... అధికార వైసీపీ పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే ఏకంగా 9 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుల్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు సంబంధించిన బిల్లుతో పాటు ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ జీతాలు, పెన్షన్ చెల్లింపులు, తొలగింపుల అనర్హత సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్‌కు నియామకాల నియంత్రణ, స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్స్ సవరణ బిల్లు, ఏపీ సీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ చట్టాల సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందడం గమనార్హం.