'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ కు ఎంపిక కాకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు ఎన్.శంకర్
- రాష్ట్ర అవార్డుకు, ఆస్కార్ కు తేడా తెలియని కమిటీ అంటూ వ్యాఖ్యలు
- కమిటీ విచక్షణతో వ్యవహరించాలని హితవు
- 'ఛెల్లో షో'లో ఏం చూసి నామినేట్ చేశారంటూ అసంతృప్తి
ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి 'ఆర్ఆర్ఆర్' నామినేట్ కావడం ఖాయమని అందరూ భావించగా, అనూహ్యరీతిలో గుజరాతీ చిన్న చిత్రం 'ఛెల్లో షో' ఆ చాన్స్ ను తాను కొట్టేసింది. దీనిపై టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
రాష్ట్ర అవార్డుకు, జాతీయ అవార్డుకు, ఆస్కార్ అవార్డుకు తేడా తెలియని కమిటీలు ఉంటే సెలెక్షన్ ఇలాగే ఉంటుందని విమర్శించారు. సెలెక్షన్ కమిటీపై అనేక ఒత్తిళ్లు ఉంటాయని, కానీ ఆ కమిటీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచక్షణతో పనిచేయాలని హితవు పలికారు. 'ఛెల్లో షో' వంటి చిత్రాలు దక్షిణాదిన ఎన్నో వచ్చాయని, ఆ చిత్రంలో ఏం చూసి ఆస్కార్ కు నామినేట్ చేశారని ఎన్.శంకర్ ప్రశ్నించారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రంలో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని, భారత సినిమా రంగ ప్రతిష్ఠను కాపాడేందుకు 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ఎంతో శ్రమించిందని, కానీ ఆ సినిమాకు ఆస్కార్ కు వెళ్లే అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.