టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ వేదికలను ప్రకటించిన ఐసీసీ
- రెండేళ్లకోమారు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్
- గతేడాది ఇంగ్లండ్ గడ్డపై ఫైనల్స్
- 2023, 2025లోనూ ఇంగ్లండ్ గడ్డపైనే ఫైనల్స్
- ఇంకా ఖరారు కాని తేదీలు
టెస్టు క్రికెట్ పునరుజ్జీవం కోసం ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్ లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో, 2023, 2205లో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు వేదికలను ఐసీసీ ప్రకటించింది. ఈ రెండు పర్యాయాలు ఇంగ్లండ్ గడ్డపైనే టెస్టు టైటిల్ సమరాలు జరగనున్నాయి. 2023లో ఓవల్ మైదానం, 2025లో లార్డ్స్ మైదానం టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
జులైలో బర్మింగ్ హామ్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రెండు ఫైనల్స్ జరిగే తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు కూడా ఇంగ్లండే వేదికగా నిలిచింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ సౌతాంప్టన్ లో జరిగింది.