ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
- తాడేపల్లి వచ్చిన టాటా సన్స్ చైర్మన్
- ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై జగన్‌తో సమావేశం
- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్
భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లి వచ్చిన చంద్రశేఖరన్... సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు, అందుబాటులో ఉన్న అవకాశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని జగన్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను చంద్రశేఖరన్‌కు ఆయన వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాలుపంచుకున్నారు.