పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా సహా ముగ్గురి నియామకం
- కరోనా నేపథ్యంలో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్
- ప్రధాని మోదీ అధ్యక్షతన ఫండ్ ట్రస్టీల బోర్డు
- టాటాతో పాటు కొత్త ట్రస్టీలుగా జస్టిస్ థామస్, కరియా ముండా
కరోనా విలయం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్‌కు ట్రస్టీలుగా వివిధ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులను నియమిస్తూ బుధవారం పీఎం కేర్స్ ఫండ్ బోర్డు ట్రస్టీల సమావేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాతో పాటుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాలను కొత్త ట్రస్టీలుగా నియమిస్తున్నట్లు బోర్డు సమావేశం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాటి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ట్రస్టీలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.