పసందైన సంప్రదాయ వంటకాలతో భారత్ జోడో యాత్రికులకు భోజనం
- భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ పాదయాత్ర
- రాహుల్ వెంట వేలాదిగా సాగుతున్న కాంగ్రెస్ శ్రేణులు
- యాత్రికుల కోసం లోకల్ ఫ్లేవర్‌తో వంటకాలు వడ్డిస్తున్న పార్టీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేబట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో యాత్రలో భాగస్వాములై సాయంత్రానికి తిరిగి వెళ్లిపోయే కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేస్తే... రాహుల్ వెంట అనునిత్యం వేల సంఖ్యలోనే జనం కలిసి నడుస్తున్నారు.
ఇలా రాహుల్ గాంధీని వెన్నంటి నడుస్తున్న పార్టీ శ్రేణులతో పాటు మధ్యలోనే యాత్రలో భాగస్వాములయ్యే వారి కోసం కాంగ్రెస్ పార్టీ పసందైన వంటకాలతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భారత్ జోడో యాత్రికులకు అందిస్తున్న ఆహారం, దానిని ఆరగిస్తున్న యాత్రికులు, భోజనంపై యాత్రికుల స్పందనలతో కూడిన ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం యాత్ర కేరళలో కొనసాగుతున్న నేపథ్యంలో...యాత్రికులకు కేరళ స్థానిక వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఈ భోజనం సూపరంటూ యాత్రికులు ప్రశంసిస్తున్నారు.