రెండు రోజుల ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 262 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 97 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ముమ్మరం చేయడం, ఈరోజు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 262 పాయింట్లు కోల్పోయి 59,456కి పడిపోయింది. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 17,718 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%), ఐటీసీ (1.59%), బజాజ్ ఫైనాన్స్ (0.76%), టెక్ మహీంద్రా (0.51%), రిలయన్స్ (0.29%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.19%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.40%), ఎల్ అండ్ టీ (-1.88%), ఎన్టీపీసీ (-1.83%).