వ్యక్తుల పేరును మార్చగలరు కానీ చరిత్రను కాదు!: సోము వీర్రాజు

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును మార్చిన వైసీపీ స‌ర్కారు
  • ఎన్టీఆర్‌ను అభిమానించే వ్య‌క్తులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నార‌న్న సోము
  • ఏం సాధిద్దామ‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని నిల‌దీత‌
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల‌యం (ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌) పేరును వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి ప‌లు వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వినిపిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. రాజ‌కీయ దురుద్దేశాల‌తోనే వైసీపీ స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ నందమూరి తారక రామారావును అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఉన్నారని ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇలాంటి నిరంకుశమైన నిర్ణయాలతో ఏమి సాధిద్దామని ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయ‌న సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌శ్నించారు. వ్యక్తుల పేరును మార్చగలరు కానీ చరిత్రను కాదు అని కూడా ఆయ‌న చురక అంటించారు.


More Telugu News