ఇకపై యూట్యూబ్‌లో సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
- లైవ్‌గా ప్రసారమైన జస్టిస్ ఎన్వీ రమణ చివరి రోజు విచారణలు
- ఈ నెల 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే విచారణలు ప్రత్యక్ష ప్రసారం
- విచారణల ప్రత్యక్ష ప్రసారంపై 2018లో సుప్రీంకోర్టు తీర్పు
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో... రాజ్యాంగ ధర్మాసనం అత్యున్నత బెంచ్. కీలకమైన కేసులను విచారణ చేపట్టేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది జడ్జీలతో కూడిన ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ధర్మాసనం ఇకపై చేపట్టే విచారణలన్నింటినీ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు నేలకు చెందిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణ రోజున చేపట్టిన విచారణలను సుప్రీంకోర్టు లైవ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా ఇకపై ఈ నెల 27 నుంచి సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే ప్రతి విచారణను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగానే వీక్షించవచ్చు. ఎప్పుడో 2018లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇన్నాళ్లకు అమలు అవుతోంది.