భూకంపం దెబ్బకు భారీ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి!

  • తైవాన్ లో ఇటీవల వరుసగా భూకంపాలు
  • ఆగ్నేయ ప్రాంతంలోని భారీ బ్రిడ్జి ముక్కలు ముక్కలై పడిపోయిన వైనం
  • భూకంపం ధాటికి ఊగిపోయిన భవనాలు, రైళ్లు, టవర్లు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోలు
ఎక్కడైనా భూకంపం వస్తే ఇళ్లు, ఎత్తయిన భవనాలు అన్నీ ఊగిపోతాయి. బలహీనంగా ఉన్నవి అయితే కుప్పకూలిపోతాయి. కానీ అత్యంత పటిష్ఠంగా కట్టిన నిర్మాణాలు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించేలా దారుణంగా దెబ్బతింటుంటాయి. తాజాగా తైవాన్ ను వరుస భూకంపాలు వణికించిన నేపథ్యంలో.. ఓ భారీ బ్రిడ్జి దెబ్బతిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుసగా భూకంపాలతో..
గత కొన్ని రోజులుగా తైవాన్ లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఏకంగా 6.8 తీవ్రతతో భారీ భూకంపం కూడా వణికించింది. గత శనివారం రాత్రి అయితే చిన్న చిన్నగా పదుల సార్లు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా ప్రకంపనలు కొనసాగాయి. పలుచోట్ల భవనాలు కూలిపోయాయి. మృతుల సంఖ్య పెద్దగా లేకున్నా ఆస్తి నష్టం మాత్రం ఎక్కువే జరిగింది.
  • ముఖ్యంగా తైవాన్ ఆగ్నేయ ప్రాంతంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ ప్రాంతంలోని పెద్ద వంతెన అయిన గావోలియావో బ్రిడ్జి చాలా దారుణంగా దెబ్బతిన్నది.
  • బ్రిడ్జి మొదటి నుంచి చివరి భాగం పొడవునా పలుచోట్ల భారీగా పగుళ్లు ఇచ్చింది. మరికొన్ని చోట్ల మెలితిప్పినట్టు తిరిగిపోయింది.
  • కొన్నిచోట్ల అటూ ఇటూ ముక్కలు ముక్కలుగా ఒరిగిపోయింది. వరుస ప్రకంపనల కారణంగా బ్రిడ్జికి ఆధారంగా ఉండే భారీ బీమ్ లు మధ్యలోకి విరిగిపోయాయి.
  • ఇక తైవాన్ లో వరుస ప్రకంపనలతో ట్రాక్ పై ఉన్న ఓ రైలు ఊగిపోవడం, ఎత్తయిన భవనాలు, టవర్ల వంటివి ఊగిపోతుండటానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
  • ఓ చోట రోడ్డు పక్కన వాహనాలు వెళ్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలు, సూపర్ మార్కెట్లలో ర్యాక్స్ ఊగిపోయి సామగ్రి కింద పడుతున్న దృశ్యాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.




More Telugu News