దసరా సెలవులను కుదించాలన్న ఎస్‌సీఈఆర్‌టీ... ససేమిరా అన్న తెలంగాణ సర్కారు
- దసరా సెలవులపై ఇదివరకే ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
- వర్షాల నేపథ్యంలో ఇచ్చిన సెలవులను సర్దుబాటు చేయాలన్న ఎస్‌సీఈఆర్‌టీ
- సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
దసరా సెలవులను కుదించనున్నారంటూ రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెలంగాణ సర్కారు బుధవారం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదివరకు ప్రకటించినట్లుగానే దసరా సెలవులు ఉంటాయని, ఆ ప్రకటనలో ఎలాంటి మార్పులు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల (అక్టోబర్) 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో... ఆ సమయంలో విద్యార్థులు నష్టపోయిన సమయాన్ని తిరిగి పొందే దిశగా దసరా సెలవులను కుదించాలంటూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ లేఖ ఆధారంగా రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్ మారనుందంటూ ప్రచారం సాగింది.