చంద్రబాబుది రాక్షస మనస్తత్వం.. ఔరంగజేబులాంటోడు!: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- కుప్పం ప్రజల్లో ఒక్కరి అకౌంట్ లోకైనా చంద్రబాబు డబ్బులు వేశారా? అన్న నారాయణస్వామి
- కుప్పంలో వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుందని వ్యాఖ్య
- చంద్రబాబు ఎప్పుడు వచ్చినా గలాటాలు, రచ్చలే ఉంటాయన్న డిప్యూటీ సీఎం
తప్పుడు మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు యత్నిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ కుప్పంకు వస్తున్నారని... ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కుప్పంకు నాన్ లోకల్ అయిన చంద్రబాబు లోకల్ గా చేసిందేమీ లేదని అన్నారు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని... దానికి కుప్పం నుంచే నాంది పలుకుతామని చెప్పారు. కుప్పం ప్రజల్లో ఒక్కరి అకౌంట్ లోకి అయినా చంద్రబాబు డబ్బులు వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా గలాటాలు, రచ్చలే ఉంటాయని అన్నారు.
చంద్రబాబు ఔరంగజేబులాంటోడని, రాక్షస మనస్తత్వమని, జన్మలో మారడని నారాయణస్వామి విమర్శించారు. కుప్పంలో వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుందని చెప్పారు. కోర్టుల్లోని జడ్జిలు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు గౌరవించాలనేది తన విన్నపమని చెప్పారు. మద్యంపై నడిచింది టీడీపీ ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వం కాదని అన్నారు. మద్యంపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు.