హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెడుతుండటంపై అట్టుడుకుతున్న అసెంబ్లీ
- ఎన్టీఆర్ పేరు మార్పుపై అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- పేరు మార్చొద్దంటూ టీడీపీ సభ్యుల ఆందోళన
- స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంపై రగడ నెలకొంది. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టాలనే అంశంపై అసెంబ్లీ అట్టుడుకుతోంది. వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పేరు మార్చొద్దని, ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కడప జిల్లా పేరును తాము మార్చలేదని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు తెలిపారు. ప్రశ్నోత్తరాల మధ్యే సభలో గందరగోళం నెలకొంది. మరోపైపు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టామని చెప్పారు. ఈ గందరగోళం మధ్య సభను 10 నిమిషాల సేపు స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయినప్పటికీ రచ్చ కొనసాగుతోంది.